గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అధికారులు చేసిన అవకతవకలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే సహించేది లేదు — కూన శ్రీశైలం గౌడ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు జిల్లా కలెక్టర్ శ్రీ గౌతం పోట్రు గారిని కలిసి ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన నిరుపేదలకు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు…
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ…
➡ గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అధికారులు చేసిన అవకతవకలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు..
➡ కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం కావున అర్హులైన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందాలన్నారు…
➡ కొందరు అధికారులు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని.. అలా చేస్తే సహించబోమన్నారు…
➡ ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు పూర్తిస్థాయిలో అర్హులైన వారికి గుర్తించాలన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ రాము గౌడ్, యాదిరెడ్డి, ముత్యం రెడ్డి, జిమ్మీ దేవేందర్, మల్లేష్ యాదవ్, పరశురాములు గౌడ్, ధర్మారెడ్డి, బుచ్చిరెడ్డి, బండి శ్రీనివాస్ గౌడ్, మోతి శ్రీను, కృష్ణ యాదవ్, ప్రకాష్, సదానందం, కోటేశ్వరరావు, సురేష్, ధర్మారెడ్డి, శ్రీను, బాబు గార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.