హైదరాబాద్ మహానగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ .

హైదరాబాద్ మహానగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ghmc కమిషనర్ ఇలంబర్తిని కలిసిన బీ ఆర్ ఎస్ పార్టీ నగర మాజీ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రా రెడ్డి, ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు, వివేకానంద, రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, శంభీపూర్ రాజు తదితరులతో పాటు పలువురు కార్పొరేటర్లు.
హైదరాబాద్ మహానగరంలో ప్రజలు
శానిటేషన్, వీధి దీపాలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూడా ghmc అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నించారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను, కొంతమేర పూర్తి చేసిన పనులను కూడా ఈ ప్రభుత్వ హయాంలో చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై పిర్యాదు చేశారు. ప్రజా సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిందుకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కమిషనర్ స్పందించలేదని పలువురు మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాల అర్హుల జాబితా తయారీలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. అక్రమాలకు తావులేకుండా ghmc ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిజమైన అర్హులను గుర్తించి వారికి అందజేయాలని కోరారు. అనంతరం కూకట్పల్లి నియోజకవర్గం లో నెలకొన్న సమస్యలు పెండింగ్ పనులపై ఇప్పటికే పలుమార్లు విన్నవించినా పరిష్కారానికి నోచుకోలేదనీ వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలంటూ mla మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా కార్పొరేటర్లు వినతి పత్రాలు అందజేశారు.

Leave a Reply