వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ గారిని కలిసి మూసాపేట్ డివిజన్ లో సమస్యలపై వినతిపత్రం అందజేసిన మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్*
మూసాపేట్ డివిజన్ లోని HMWS&SB సంబంధించిన సమస్యలపై కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్ గారు, వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
ముఖ్యంగా బాలాజీ స్వర్ణపురి కాలనీ లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం వల్ల నీటి కొరత ఏర్పడుతోందని, అందుచేత అక్కడ 300 mm డయా వాటర్ పైప్ లైన్ పనులకు నిధులు మంజూరు చేయాలని, అదేవిధంగా అవంతి నగర్ ఈస్ట్,బబ్బుగూడ, జనతా నగర్ లలో డ్రైనేజీ ఓవర్ ఫ్లో అవుతుందని, దానిని పరిష్కరించడానికి ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ పైప్ లైన్లను పునరుద్ధరించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన వాటర్ వర్క్స్ ఎం.డి అశోక్ రెడ్డి గారు, ప్రాధాన్యత క్రమంలో నిధులను మంజూరు చేసి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు