శ్రీ చిత్తారమ్మ దేవస్థానంలో మూల మంత్రజపము, దేవతాహోమాలు,పూర్ణాహుతిలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో శ్రీ శ్రీ చిత్తారమ్మ తల్లిని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి మూలమంత్ర జపము, దేవతహోమాలు, పూర్ణాహుతి పూజలో పాల్గొన్నారు..
అనంతరం వారు వేద పండితుల అర్చనల మధ్య శ్రీ చిత్తారమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ… చిత్తారమ్మ దేవి 50వ స్వర్ణోత్సవాల జాతరలో భక్తులు అధిక సంఖ్యలో రావడం చాలా సంతోషంగా ఉందన్నారు… రానున్న రోజుల్లో చిత్తారమ్మ దేవి జాతర రాష్ట్రం నలుమూలల తెలిసేలా ప్రయత్నం చేస్తానన్నారు.



