ఎస్పీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షనిగా గా ఎన్నికైన *జీడిగంటి కార్తీక్
కూకట్పల్లి నియోజకవర్గం లో ఫతేనగర్ డివిజన్ చెందిన *ఎస్పి నగర్ * కాలనీ ఎన్నికలో యువకుడు ఉత్సాహవంతుడు మంచి మెజార్టీతో గెలవడం జరిగింది.. ఎస్పీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షనిగా గా ఎన్నికైన జీడిగంటి కార్తీక్ కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మీ సపోర్ట్ కు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సతీష్ రెడ్డికి శాలువాతో సత్కరించారు.. శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ యువకులకు 100% సపోర్ట్ గా ఉంటానని యువకులను మంచి దారిలో నడవాలని రాజకీయాల్లోకి కూడా యువకులు రావాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి చీటకోరు కృష్ణ, కూకట్పల్లి నియోజకవర్గం యువజన ప్రధాన కార్యదర్శి జెరిపాటి రాజు పతేనగర్ డివిజన్ యువజన కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పనుగంటి రాకేష్ తదితరులు పాల్గొన్నారు..