అల్లాపూర్ సర్వే లో మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు .
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్దర్ నగర్ రాజీవ్ గాంధీ నగర్ అల్లాపూర్ సర్వేనెంబర్ 18 లలో ఈరోజు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ గార్లు, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, జలమండలి, శానిటేషన్, యు బి డి, ఎంటమాలజీ, జిహెచ్ఎంసి స్ట్రీట్ లైట్స్, సిపిడిసిన్, అన్ని విభాగాల అధికారులతో కలిసి అల్లాపూర్ డివిజన్లో మేయర్ గారు పర్యటించారు, ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్లోని ప్రధానంగా సబ్ధర్ నగర్ ఈ బ్లాక్లో డ్రైనేజీ మంచినీటి సరఫరా, మరియు సిసి రోడ్లు కొరకు, రాజీవ్ గాంధీ నగర్, సబ్దర్ నగర్ మధ్యలో స్ట్రామ్ వాటర్ నిర్మించాలని, రాజీవ్ గాంధీ నగర్ సి బ్లాక్ వరకు భూగర్భ డ్రైనేజీ, అల్లాపూర్ సర్వే నంబర్ 18 లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, కుబాబ్ మజీద్ నుండి సర్వేనెంబర్ 18 వరకు స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మించాలని వర్షాకాలంలో స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు, పద్మావతి నగర్ లో కమ్యూనిటీ హాల్ కొరకు వినతి పత్రాలను కార్పొరేటర్ గారు అందజేయడం జరిగింది. దీనికి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు సానుకూలంగా స్పందిస్తూ జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ గారికి తక్షణమే నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, నాగుల సత్యం, అబ్దుల్ రహీం, షేక్ ఇస్మాయిల్, అబ్దుల్ హమీద్, సయ్యద్ రియాజ్, రాంబాబు, సయ్యద్ నజీర్, జావిద్దీన్, మల్లేష్, అస్లాం, సలావుద్దీన్, షేక్ రఫీక్, మొయిన్, సంజీవరెడ్డి, కమల్ వాసన్, రాము యాదవ్, పార్వతమ్మ, ముత్యాల దుర్గా, శమ, తదితరులు పాల్గొన్నారు