ప్రజావాణిలో నీటి సమస్యలపై HMWSSB అధికారులను నిలదీసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో కూన శ్రీశైలం గౌడ్ గారు పాల్గొని.. వివిధ డివిజన్లలో ఆదర్శనగర్, దేవభూమి నగర్, మెట్కాన్ గూడ, శారదా కాలనీ, కెకెఎమ్ నగర్, రాజీవ్ గాంధీనగర్, కళావతి నగర్, శ్రీవేను ఎంక్లవ్, చింతల్ సూరారం కాలనీ, జగద్గిరిగుట్టలో నీళ్లు లో ప్రెజర్ మరియు సరిపడే త్రాగు నీటి సమస్యలపై జనరల్ మేనేజర్ అశోక్ మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్బంగా అధికారులను నిలదీసి…ప్రజలకు మంచినీటి సమస్య రాకుండా చూడాలన్నారు.
అనంతరం శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రజల సంక్షేమం కోసమే అన్నారు.ప్రజావాణిలో వచ్చిన సమస్య పరిష్కరించే ప్రయత్నం చేసి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన విధానం అధికారులు మర్చిపోయి.. ఈ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలనీ చూస్తే సహించేది లేదని హెచ్చరించారు .మళ్లీ ఈ విధంగా చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని .. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ HMWSSB అధికారుల పై మండిపడ్డారు.