ప్రజలకు ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోసామాజిక ఆరోగ్య కార్యకర్తలు (ఆశ వర్కర్స్)
కూకట్పల్లి మండలం అల్లాపూర్ డివెసైన్, వి.వి.నగర్ నందు ఈరోజు ఆశ వర్కర్ శ్రీలక్ష్మి గారు , ప్రభుత్వం అందిస్తున్న (మాత శిశు శంరక్షణ ) పధకం లో భాగంగా, మా యొక్క పరిధిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ హెల్త్ అండ్ వేక్సిన్ తెలియ పరచటం కోసం రావటం జరిగింది,మా యొక్క పరిధి లో వున్న గర్భిణీ స్త్రీల తో మాట్లాడి వారి యొక్క వివరాలు నమోదు చేయించటం జరిగింది .అలాగే తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు , పాటించాల్సిన ఆహార నియమాలు తెలియజేశారు.ప్రభుత్వం అందించిన సేవలు అందుపుచ్చుకోవలని , గర్భిణీ స్త్రీలు వారి యొక్క వివరాలు (మాత శిశు శంరక్షణ ) కార్డు లో పొందుపర్చుకోవాలని, ఆశ వర్కర్ శ్రీలక్ష్మి గారు కోరారు.