కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ సర్వే సత్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ శేరి సతీష్ రెడ్డి గారు*
ఈరోజు హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ గారి నివాసంలో వారిని కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ శేరి సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గురువారం నాడు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ సర్వే సత్యనారాయణ గారిని శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది, అదేవిధంగా ఈ సందర్భంగా ఇటీవల మరణించిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశయాలను గుర్తు తెచ్చుకున్నారు, నిబద్ధతగల నాయకుడు విద్యావంతుడు వినయ విధేయత కలిగిన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ అని మాజీ కేంద్రమంత్రి శ్రీ సర్వే సత్యనారాయణ గారు కొనియాడారు తాను ఎంపీగా ఉన్న సమయంలో పలు అంశాల పైన మనోహన్ సింగ్ గారిని నేరుగా కలిసి పది అంశాల మీద చర్చించడం జరిగిందని, వారు పార్టీ నేతలతో అంశాలను గుర్తు తెచ్చుకున్నారు… ఈ కార్యక్రమం పాల్గొన్నవారు
బి సంజీవరావు, డివిజన్ ప్రెసిడెంట్ తమ్మినేని ప్రవీణ్ కుమార్, మేకల మైకల్, Amc డైరెక్టర్ పనింద్ర కుమార్, కూకట్పల్లి మాజీ ఉపాధ్యక్షురాలు రేష్మ, శ్రీధర్ చారి, బాబురావు, రామకృష్ణారెడ్డి, గిరి నాయుడు, రాజు, తదితరులు పాల్గొన్నారు.*