అమ్మవారి ప్రధాన ద్వారం తలుపులకు వెండి తొడుగు , 30 కిలోల వెండి బిస్కెట్లను అంధజేత.

కూకటపల్లి శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ లక్ష్మి దేవి అమ్మవారి ప్రధాన ద్వారం తలుపులకు వెండి తొడుగు దాతలు శ్రీ యలమంచిలి రాధాకృష్ణ,ఝాన్సీ లక్ష్మి గార్లు గురువారం రోజు 30 కిలోల వెండి బిస్కెట్లను స్వామివారి ఆలయంలో గౌరవ కూకట్పల్లి ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు గారి సమక్షంలో ఆలయ పండితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పగుడల బాబురావు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మెన్ నాయినేని చిన్న తులసీరావులతో పాటు పలువురు కమిటీ సభ్యులు, ఆలయ పండితులు పాల్గొన్నారు.