పేదల పెన్నిధి,కార్మిక పక్షపాతికి ఘన నివాళులు….
స్వర్గీయ పిజేఆర్ వర్థంతి సందర్భంగా మూసాపేట్ వడ్డెర బస్తీలో మరియు గూడ్స్ షెడ్ రోడ్డులో గల పిజేఆర్ విగ్రహం వద్ద స్మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు.కార్మిక, పేద ప్రజల పక్షాన నిలబడి వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు జనార్దన్ రెడ్డి గారని ఎమ్మెల్యే కృష్ణారావు గారు అన్నారు.
కార్యక్రమంలో కూకట్ పల్లి కార్పోరేటర్ జూపల్లి సత్యనారాయణ,డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు కర్క పెంటయ్య, జిల్లా గోపాల్, కర్క రవీందర్,గరిగె తుకారాం, విష్ణు, జెల్ల రాము,డాకయ్య,ఇనుగంటి రాజు, శివశంకర్, రవి సింగ్, వెంకట్ స్వామి, అరుణ్,కృష్ణ, పాండు,నరేష్ , సురేష్, చందు,కొండిబ, నిఖిల్ , ప్రదీప్,మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.