దీక్ష – దివస్ కార్యక్రమానికి కూకట్ పల్లి నియోజకవర్గం యం. ఎల్. ఎ మాధవరం కృష్ణా రావు గారి నాయకత్వములో నియోజకవర్గం లోని దీక్షా దివస్ కార్యక్రమం విజయవంతము చేసారు
దీక్ష దివాస్ సందర్భంగా మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దీక్ష దివస్ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు జిల్లా ఇంచార్జ్ స్వామి గౌడ్ హాజరయ్యారు. ప్రతి నియోజకవర్గం నుండి గులాబీ శ్రేణులు భారీగా తరలి రావడంతో కార్యకర్తలకు నాయకులకు నూతన ఉత్తేజం ఏర్పడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు నేను ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేపట్టలేదని ఎమ్మెల్యేగా గెలిచాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అసెంబ్లీలో ఒక బాధ్యతగా కేసీఆర్ మాట్లాడిన మాటలకు ఆకర్షితులమై బిఆర్ఎస్ పార్టీలో చేరామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. రాష్ట్రం ఏర్పడిన పది సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దే