ప్రజా సమస్యలను తెలుసుకొని అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
మూసాపేట డివిజన్లోని అవంతి నగర్ తోటలో స్థానికుల సమస్యలపై అధికారులు మరియు కాలనీవాసులతో కలిసి పర్యటించారు. కాలనీలలోని మంచినీటి సమస్య ఎదురవుతుందని అదేవిధంగా డ్రైనేజ్ రోడ్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాలనీవాసులకు మంచినీళ్లు సరిపోయే విధంగా వాటర్ వర్క్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా డ్రైనేజీ,మంచినీటి పైప్ లైన్ కోసం తవ్విన రోడ్లకు మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్, సత్యం , తిరుపతి, నరసింహ రెడ్డి, వెంకటేశ్వరులూ, సుశీలు కుమార్ యాదవ దేవేందర్ , మహేందర్ మరియు జిహెచ్ఎంసి డి .ఈ, వాటర్ వర్క్స్ వి. ప్రకాష్ అధికారులు పాల్గొన్నారు